
ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్ రోడ్డు కం రైలు బ్రిడ్జి మరమ్మతు పనులు శరవేగంగా సాగుతున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత తెలిపారు. ఆదివారం రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై జరుగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించారు. వాస్తవ పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై రోడ్డు నిర్మాణ పనుల శరవేగంగా జరుగుతున్నాయన్నారు. భారీ వాహనాల రాకపోకలు సాగించకుండా వంతెన ప్రవేశ మార్గంలో గడ్డర్ల నిర్మాణం చేపట్టడం జరుగుతోందని తెలిపారు. త్వరలో రోడ్‌పై రాకపోకలు సాగించేవిధంగా చురుగ్గా పనులు జరుతున్నట్లు తెలిపారు. కలెక్టర్‌కు ఆర్ అండ్ బి సహాయ ఇంజనీర్ పనుల తీరును వివరించారు. కలెక్టర్ వెంట ఆర్‌డిఒ ఎస్.మల్లిబాబు, ఆర్ అండ్ బి ఎఇ సిహెచ్.సత్య మాధవీ, తహశీల్దార్ బి.నాగరాజు నాయక్ తదితరులు ఉన్నారు.