Nov 16,2022 22:49

ప్రజాశక్తి-నందిగామ
మూడేళ్లలోనే వేగవంతంగా నందిగామ పట్టణ అభివృద్ధి చెందిందని నందిగామ ఎంఎల్‌ఎ మొండితోక జగన్మోహనరావు పేర్కొన్నారు. పట్టణంలోని 12 వ వార్డులో బుధవారం గడపగడపకు- మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల క్యాలెండర్‌ ను అందజేస్తూ ప్రభుత్వ పనితీరును ఎంఎల్‌ఎ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందిగామ పట్టణాన్ని గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి చేసి చూపుతామని , పట్టణంలోని 20 వార్డుల అభివృద్ధితో పాటు ప్రధాన రహదారులు, మేజర్‌ డ్రైనేజీల నిర్మాణానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్‌ డాక్టర్‌ జయరామ్‌, ఎఇ ఫణి శ్రీనివాస్‌, ఇన్చార్జి కోమటి రవికుమార్‌ ,కౌన్సిల్‌ మరియు కో ఆప్షన్‌ సభ్యులు, సచివాలయ సిబ్బంది -వాలంటీర్లు ,వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు .