సర్వే రాళ్ల వేయడాన్ని పరిశీలిస్తున్న జెసి కల్పనాకుమారి
ప్రజాశక్తి-కశింకోట
రీ సర్వే జరిపిన భూములలో సర్వే రాళ్లను పూర్తి కచ్చితత్వంతో ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె మండలంలోని తాళ్లపాలెం శివారు గైతులపాలెం, కసింకోట గ్రామాలలో జరుగుతున్న స్టోన్ ప్లాంటేషన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూమి కొలతలకు అనుగుణంగా ఏం మాత్రం తేడా లేకుండా కచ్చితంగా గుర్తించి రాళ్లు వేయాలని ఆదేశించారు. అక్కడి రైతులతో జెసి మాట్లాడారు. భూమిలో సర్వే రాళ్లు వేయడం సక్రమంగా జరుగుతుందా లేదా అని వారిని అడిగి తెలుసుకున్నారు. తాళ్లపాలెం, కసింకోట సచివాలయాల్లో రాళ్లను కూడా ఆమె పరిశీలించారు. ఈ పర్యటనలో ఇన్‌ఛార్జి తహశీల్దారు సురేష్ నాయుడు, మండల సర్వేయర్ దినేష్ తదితరులు పాల్గొన్నారు.










