సమీక్ష నిర్వహిస్తున్న దశ్యం
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :సురక్ష పథకం కార్యక్రమంలో భాగంగా తహశీల్దార్ హమీద్ గురువారం సర్వే ప్రక్రియను పరిశీలించారు. మండంలోని పేడూరు సచివాలయం పరిధిలోని 3, 4 క్లస్టర్లో ఇంటింటా నిర్వహించిన సర్వేను తహశీల్దార్ పరిశీలించారు. తోటపల్లి గూడూరు బిట్-1 సచివాలయం పరిధి కిందకు వచ్చే 3వ క్లస్టర్లో తహశీల్దార్ హమీద్ ఇంటింటా సర్వే కార్యక్రమాన్ని పరిశీలించారు.వాలంటీర్లకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం జగనన్నకు చెబుదాం.. ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిష్కారంపై ఆర్‌ఐ సునీల్ రెడ్డి, వీఆర్వోలతో హమీద్ సమీక్ష నిర్వహించారు. వీఆర్వోలు చలపతి, శ్రీవాసులు, రవీంద్రారెడ్డి ఉన్నారు.










