Sep 05,2023 17:55

     జీలుగుమిల్లి : ఇళ్ల మ్యాపింగ్‌ సర్వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డిఎల్‌పిఒ మహ్మద్‌రజాఉల్లా తెలిపారు. మంగళవారం మండలంలోని తాటియాకులగూడెం పంచాయతీలోని బర్రింకలపాడు గ్రామంలో జరుగుతున్న ఇళ్ల మ్యాపింగ్‌(స్వమిత్వ) సర్వేను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వమిత్వ పథకంలో భాగంగా చేపడుతున్న ఇళ్ల మ్యాపింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందికి తెలియజేశారు. అనంతరం తాటియాకులగూడెంలో చర్చి నిర్మాణాన్ని ఆపాలని స్పందన కార్యక్రమంలో అదే గ్రామానికి చెందిన పలువురు ఫిర్యాదు చేయగా, వారిని పిలిపించి విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా సేకరించిన నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు ఆయన తెలిపారు. అప్పటి వరకు చర్చి నిర్మాణ పనులను ఆపాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వీరలక్ష్మి, సర్పంచి వనమా రాంబాబు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.