Aug 19,2022 23:17

గీత కార్మిక సంఘ నేతలకు సత్కారం

ప్రజాశక్తి- ఆనందపురం      సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ ఆదర్శప్రాయుడని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర యాత బిసి వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బాడితబోయిన రాములప్పుడు అన్నారు. శుక్రవారం ఆనందపురం గ్రామంలో సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ జీవిత చరిత్ర గీత కార్మికులకు ఆదర్శమని, బహుజన సామ్రాప్య స్థాపనకు తన ప్రాణాలను కోల్పోయారాన్నారు. యువత పాపన్నగౌడ్‌ అడుగుజాడల్లో నడుస్తూ, గీత కార్మికులందరూ ఐకమత్యంగా ఉంటేనే రాజ్యాధికారం సాధించగమన్నారు.
యాత సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చోడి ఆదినారాయణ మాట్లాడుతూ సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ మాట్లాడుతూ, సాధారణ కల్లుగీత కార్మికుడి స్థాయి నుండి భువనగిరి, కిలాసపూర్‌, గోల్కొండ కోటలను జయించి రాజ్యపాలన చేసిన ఏకైక గౌడ వ్యక్తి అని కొనియాడారు. కుప్ప రాజశేఖర్‌ మాట్లాడుతూ మొగల్‌ సింహాసనాన్ని గడగడలాడించిన ధీరుడు, బహుజన సామ్రాజ్యాన్ని స్థాపించిన వీరుడు, గోల్కొండ కోటను పాలించిన బహుజన బిడ్డ సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ అన్నారు. అనంతరం యాత సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులను సన్మానించారు. కార్యక్రమంలో ఆనందపురం కల్లుగీత కార్మికుల సంఘం ప్రెసిడెంట్‌ కుప్ప పరిసయ్య, సెక్రటరీ కుప్ప గురువులు, కుప్ప సూరిబాబు, కుప్ప చెంచునాయుడు ముడసల రాము, కుప్ప సన్యాసిరావు, ముడసల శ్రీను, కుప్ప దుర్గారావు, ముత్యాల నరసింగరావు నాయుడు, కుప్ప గౌరీ అప్పలరాజు, అప్పారావు కల్యాణ్‌ గణేష్‌, రాములప్పుడు, శ్రీను, రాజు, కార్తీక్‌, లోకేష్‌ పాల్గొన్నారు.