అంగన్‌వాడీ సరుకుల తరలింపునకు అవస్థలు
ప్రజాశక్తి-జి.మాడుగుల: మండలంలో కిల్లంకోట పంచాయతీలో పలు గ్రామాలకు రోడ్డు సదుపాయం లేదు. దీంతో, బుధవారం అంగన్‌వాడి సరుకులు తీసుకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీపులో అంగన్వాడి సరుకులు తీసుకు వెళ్తుండగా మార్గమధ్యలో జీపు బురదలో కూరుకు పోయింది. చేసేదేమీ లేక సరుకులు కిందకు దించి గ్రామస్తుల సాయంతో మోసుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి ఎదురైంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారి సౌకర్యం కల్పించాలని పలువురు గిరిజనులు కోరుతున్నారు.










