సరుకుల కోసం సంచుల ఎదురుచూపు
ప్రజాశక్తి- సోమల: చౌక దుకాణాల ద్వారా సరఫరా చేసే నిత్యావసర సరుకులు కార్డుదారులకు ఎప్పుడు ఇస్తారు ఏమో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో చౌక దుకాణాల వద్ద ప్రజలు సంచులను, రాళ్ళను ముందస్తుగా ఉంచి వారి స్థానాన్ని రిజర్వేషన్ చేసుకుంటున్నారు. మండల కేంద్రంలోని రామాలయం సమీపంలో ఉన్న చౌకదుకాణం వద్ద ఆదివారం ఉదయం నిత్యావసర సరుకుల కోసం కార్డుదారులు ముందస్తుగా గుర్తు కోసం సంచులను రాళ్లను లైనుగా ఏర్పాటు చేయడాన్ని ప్రజాశక్తి గమనించింది. నిత్యావసర సరుకులు ఎప్పుడు ఇస్తారో తెలియపోవడంతే ఇచ్చే సమయానికి వచ్చి సరుకులు తీసుకునేందుకు ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నట్లు స్థానిక కార్డుదారులు తెలిపారు.










