Jul 06,2023 20:01

సర్టీఫికేట్లు అందజేస్తున్న ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి

ప్రజాశక్తి - లింగసముద్రం :జగనన్న సురక్ష లాంటి పథకం దేశంలో ఎక్కడ లేదని, ప్రజలకు నేరుగా అవసరమైన సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి ఈ పథకాని తీసుకొచ్చినట్లు ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని అన్నేబోయినపల్లి, చినపవని గ్రామాల్లో జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. చినపవనిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎల్‌ఎ మహీధర్‌రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ కార్యలయాలు చూట్టు తిరగకుండా గ్రామంలోనే సర్టిఫికెట్లు ఇస్తున్నట్లు తెలిపారు.చినపవని గ్రామం అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తున్న ఎంఎల్‌ఎ మహీధర్‌రెడ్డికి గ్రామ సర్పంచ్‌ దామా సీతారామయ్య కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎంఎల్‌ గ్రామస్తులకు సర్టిఫికెట్లు అందజేశారు. తొలుత అన్నేబోయినపల్లిలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించి గ్రామస్తులకు సర్టిఫీకెట్లు అందజేశారుకందుకూరు ఎఎంసి వైస్‌ చైర్మన్‌ మేకనబోయిన శ్రీనివాసులు,ఎంపిడిఓ శేషుబాబు,వైసిపి మండల కన్వీనర్‌ పిచ్చపాటి తిరుపతిరెడ్డి,జెసిఎస్‌ కన్వీనర్‌ వరికూటి క్రిష్ణారెడ్డి,చినపవని సర్పంచ్‌ దామా సీతారామయ్య,వైసిపి నాయకులు అల్లం రాజేష్‌,చీమల శ్రీనివాసులు,సర్పంచ్‌లు పేలపల్లి మహేష్‌,డబ్బుగొట్టు మల్లిఖార్జున, ఎంపిటిసి దగ్గు వెంకటేశ్వర్లు ఉన్నారు.