సర్టిఫికెట్లు అందజేస్తున్న ఎంఎల్‌ఎ మహీధర్ రెడ్డి
ప్రజాశక్తి-కందుకూరు : జగనన్న సురక్ష కార్యక్రమం శనివారం కందుకూరు జనార్ధన కాలనీ ఒకటో సచివాలయంలో ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించినారు. ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన ధ్రువపత్రాలు జారీ చేస్తారన్నారు. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలతో మాట్లాడి వారికి అసవరమైన సేవలకు సంబంధించిన అభ్యర్థనను రిజిస్టర్ చేస్తారన్నారు. ప్రజా సమస్యల తక్షణపరిష్కారం కోసం స్పందన, జగనన్నకు చెబుదాం కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఎస్‌ఎస్ శోభికా, మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్, ప్రభుత్వ అధికారులు, జె ఎస్ సి కన్వీనర్ , వైసిపి ముఖ్య నాయకులు, కన్వీనర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు.










