Nov 06,2023 23:28

ప్రజాశక్తి-రామచంద్రపురం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అనేక పాఠశాల్లో బాలల దినోత్సవాన్ని శరత్‌ చంద్ర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించామని ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు ఆకేటి మంగా రాణి తెలిపారు. ద్రాక్షారామ జెడ్‌పి ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్‌ పోటీలు నిర్వహించారు. విజేతలకు శరత్‌ చంద్ర ఫౌండేషన్‌ సిఇఒ అకేటి రాణి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బివిసి ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు వాలంటీర్లుగా వ్యవహరించారు. ప్రదానోపాధ్యాయిని గుణ్ణం రాజేశ్వరి, పాఠశాల ఉపాధ్యాయులు వాడ్రేవు రత్న పద్మావతి, శ్రీమన్నారాయణ పసుపులేటి మెహర్‌ సుజాత, జిల్లా సైన్స్‌ అధికారి జివిఎస్‌ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.