ప్రజాశక్తి - వేటపాలెం
మండలంలోని దేశాయిపేట జడ్‌పి హై స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సరస్వతీ మాత విగ్రహంను పట్టబద్రుల సంఘం ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షులు ప్రత్తి వెంకట సుబ్బారావు ఆదివారం ఆవిష్కరించారు. సభకు హెచ్‌ఎం మల్లేశ్వరి అధ్యక్షత వహించినారు. ఎంఇఒ పురుషోత్తం మాట్లాడుతూ సరస్వతి దేవి చదువులకు స్ఫూర్తిదాయని అన్నారు. విద్యార్థులు అందరూ చదువులపై శ్రద్ధ పెట్టి ఉన్నత స్థితికి ఎదగాలని కోరారు. సత్రం మల్లేశ్వరరావు మాట్లాడుతూ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం సంతోషంగా ఉందని అన్నారు. విద్యాభివృద్ధికి చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. సమాజ సేవలో తమ శిష్యులు ముందడుగులో ఉండటం ఆనందంగా ఉందని అన్నారు. ప్రొఫెసర్ శివశంకర్ మాట్లాడుతూ విద్యార్థులు విజ్ఞానవంతులై, ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరినారు. పట్టబద్రుల సంఘ అధ్యక్షులు ప్రత్తి వెంకటసుబ్బారావు మాట్లాడుతూ సరస్వతీ విగ్రహము ఏర్పాటుకు అవకాశం ఇచ్చినందుకు పాఠశాల అధ్యాపకులకు ధన్యవాదంలు తెలిపారు. సభలో ఆహ్వానితులను సత్కరించారు. కార్యక్రమంలో ఎ నాగ వీరభద్రాచారి, రోటరీ క్లబ్ అధ్యక్షులు బట్ట మోహనరావు, విశ్రాంత అధ్యాపకులు విశ్వేశ్వరరావు, పట్టభద్రుల సంఘం కార్యదర్శి, ఉపాధ్యాయులు సుంకర వెంకటలక్ష్మి ప్రసాద్, ఉమ్మిటి శివపార్వతీ, సజ్జ శ్రీధర్‌రావు, బుర్రా సాంబశివరావు, నున్నా శివప్రసాదరావు, గుడిమూటి శేఖర్ బాబు, దేవరకొండ నాగరాజు, రామకృష్ణ, కరణం మురళీకృష్ణ, వంకా శ్రీనివాసరావు, వేటపాలెం జెడ్‌పి హైస్కూల్ ప్రధాన అధ్యాపకులు దుర్గాకుమార్, గుత్తి వెంకటేశ్వరరావు, మురళీకృష్ణ, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ రవిబాబు శ్రీహరిరావు పాల్గొన్నారు.