Sep 30,2023 21:57

వెటర్నరీ కళాశాలలో శ్రీజ సర్వసభ్య వార్షిక సమావేశం

శ్ర్రీజ టర్నోవర్‌ రూ.933 కోట్లు



అందరి సహకారంతో సాధ్యం : కుంటపల్లి శ్రీదేవి

పజాశక్తి-తిరుపతి(మంగళం)
తిరుపతి కేంద్రంగా ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా యాజమాన్య పాల ఉత్పత్తిదారుల సంస్థగా పేరుగాంచిన శ్రీజ మహిళా మిల్క్‌ ప్రొడ్యూసర్‌ కంపెని లిమిటెడ్‌ 2022-23 ఆర్ధిక సంవత్సరానికి గాను రూ.933 కోట్ల టర్నోవర్‌ చేరుకుందని శ్రీజ ఛైర్‌ పర్సన్‌ కుంటపల్లి శ్రీదేవి తెలిపారు. శ్రీజ 10వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని తిరుపతి వెటర్నరీ కళాశాల ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కుంటపల్లి శ్రీదేవి మాట్లాడుతూ శ్రీజ సంస్థ గత ఆర్ధిక సంవత్సరం 2022-23 లో రు.933 కోట్ల టర్నోవరును సాధించిందని, గతేడాదితో పోలిస్తే 32 శాతం పెరిగిందన్నారు. ఈ ఆర్ధిక సంవత్సర్భనికి గాను 50,953 మంది అర్హులైన మహిళా సభ్యులకు రూ.6.93 కోట్ల బోనస్‌ను, 5 లీటర్ల స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌ పాలక్యానులను పంపిణీ చేశామన్నారు. 2022-23 కుగాను పాల బిల్లుల రూపంలో రూ.672కోట్లను మహిళా సభ్యుల బ్యాంకు ఖాతాలలో నేరుగా జమ చేశామన్నారు. గతేడాది సభ్యులకు రూ.1.78 కోట్లను డివిడెండ్‌ రూపంలో చెల్లించటానికి పాలక మండలి సిఫార్సు చేసినట్లు చెప్పారు. శ్రీజ సంస్థ ముఖ్యకార్యనిర్వహణాధికారి జయతీర్థచారి మాట్లాడుతూ నేషనల్‌ డైరీ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌(ఎన్‌డిడిబి), భారత ప్రభుత్వ సహకారంతో పలు ప్రాజెక్టులను ప్రారంభించినట్లు తెలిపారు. శ్రీజ సంస్థ, చిత్రావతి ఫోడర్‌, అగ్రి ప్రొడ్యూసర్‌ కంపెనీని స్థాపించి దాని ద్వారా ఎంపికచేసిన కరవు పీడిత ప్రాంతాల రైతులకు పచ్చిగడ్డి, ఎండుగడ్డి, సైలేజ్‌ సంవత్సరం పొడవునా అందుబాటులో ఉండటంతో పాటు రైతులకు లాభసాటిగా ఉండేలా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌ పథకం క్రింద ''సెక్స్‌ సార్టెడ్‌ సెమెన్‌'' ను పశువులకు అందుబాటులోనికి తెచ్చి రైతుల ఉత్పాదకత, పశు ఆరోగ్యం పెంపొందించేలా చేస్తున్నామన్నారు. అలాగే, భారతదేశంలోనే దిగ్గజ సంస్థలైన టాటా ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, టీవిఎస్‌ మోటార్స్‌ లిమిటెడ్‌ వారి సహాయ సహకారంతో తమిళనాడులో 3 పాల శీతలీకరణ్‌ కేంద్రాలను ప్రారంభించి ఆ చుట్టుపక్కల గ్రామాల రైతులకు మేలు కలిగేలా చేస్తున్నామన్నారు. శ్రీజ సంస్థ ప్రారంభం నుండి మహిళా పాడిరైతులు ఆర్ధిక స్వావలంబన సాధించేందుకు కషిచేస్తూ, వారు సరఫరా చేసిన పాలకు అత్యంత గిట్టుబాటుధర చెల్లించడం గత 9 సంవత్సరాలుగా చేస్తూ ఒక బెంచ్‌ మార్క్‌ను సష్టించామన్నారు. దీంతో తప్పక ఈ ప్రాంతంలోని అన్ని డెయిరిలు కూడా ఎంతో కొంత రైతులకు ధరలు పెంచి చెల్లించవలసిన అవసరాన్ని తీసుకువచ్చామన్నారు. తద్వారా శ్రీజ సభ్యత్వంతో సంబంధం లేకుండా ఈ ప్రాంత పాడిరైతులందరికి గత దశాబ్ధంలో మంచి ధర వచ్చేలాగా శ్రీజ సంస్థ కషిచేసిందన్నారు.
వెటర్నరీ కళాశాలలో శ్రీజ సర్వసభ్య వార్షిక సమావేశం