Jul 31,2023 21:00

మహాధర్నాలో మాట్లాడుతున్న రాష్ట్ర సర్పంచుల సంఘం వ్యవస్థాప అధ్యక్షులు రాజేంద్రప్రసాద్‌

కడప అర్బన్‌ : సర్పంచులను ఉత్సవ విగ్రహంలా మార్చిన ఏకైక ప్రభుత్వం వైసిపినే అని అఖిలపక్ష నేతలు పేర్కొన్నారు. సర్పంచుల సమస్యల పరిష్కారానికి ఎపి పంచా యతీరాజ్‌ ఛాంబర్స్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముని రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద సోమ వారం ఉమ్మడి జిల్లాల సర్పంచులు మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సర్పంచుల ధర్నాకు సిపిఎం, టిడిపి, కాంగ్రెస్‌. బిజెపి, జనసేన, సిపిఐ, లోక్‌సత్తా పార్టీ నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్‌రెడ్డి నాలుగేళ్ల పాలనలో గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి ఇవ్వకపోగా గ్రామ పంచాయతీల కేంద్ర ఆర్థిక నిధులు రూ. 8,066 కోట్లు సొంత పథకాలకు వాడుకున్నారని పేర్కొన్నారు. ఇంటి పన్ను, నీటి పన్ను ద్వారా పంచాయతీలకు వచ్చే నిధులు విద్యుత్‌ సాకుతో నిలిపి వేశారన్నారు. దొంగలించిన నిధులు ఇవ్వాలని రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పంచాయతీల అభివద్ధికి కావాల్సిన నిధులు విడుదల చేసిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరితో వైసిపి సర్పంచుల ఉద్యమానికి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. ఈనెల 2న రాష్ట్ర ప్రభుత్వ తీరు పై కేంద్ర ప్రభుత్వానికి సర్పంచులతో కలిసి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వైసిపి పాలనలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మీడియా ఇన్‌ఛార్జి తులసి రెడ్డి మాట్లాడుతూ పంచాయతీ రాజ్‌ వ్యవస్థకు ఒక చరిత్ర ఉందన్నారు. ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే, సర్పంచ్‌ను ప్రజలు ఎన్నుకుంటారని చెప్పారు. గ్రామాల్లో సమస్యలను ప్రజలు నేరుగా సర్పంచులకు చెబుతారన్నారు. పైసా నిధులు ఇవ్వకపోతే సమస్యలు ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. వాలంటరీ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ అని ఇక ఎన్నికలు ఎందుకన్నారు. టిడిపి సీనియర్‌ నాయకులు లక్ష్మిరెడ్డి, హరి ప్రసాద్‌, గోవర్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ పంచాయతీల్లో సర్పంచులకు విధులు ఉన్నాయే తప్ప కానీ నిధులు లేవన్నారు. కేంద్ర ప్రభుత్వ పంచాయతీ నిధులు దారి మళ్లించిన ఘనత వైసిపి ప్రభు త్వానిదే అన్నారు. గ్రామాల అభివద్ధికి పంచాయతీకి నిధులు ఇచ్చి అభివద్ధి చేసింది తెలుగుదేశం అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి చంద్ర మాట్లాడుతూ పంచా యతీ వ్యవస్థ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిందని, నిర్వీర్యం చేయడం ఏ రాష్ట్రంలో జరగల ేదన్నారు. హక్కుల పోరాటానికి ఎంత వరకైనా వెళతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లోక్‌సత్తా పార్టీ దేవర శ్రీకష్ణ మాట్లాడుతూ అవగాహన రాహిత్యంతో జగన్‌ పాలన చేస్తూ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ బత్యాల చంగల్‌ రాయుడు. టిడిపి జిల్లా అధ్యక్షులు మల్లెల లింగారెడ్డి. సర్పంచులు ప్రసంగించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల సర్పంచులు, జడ్‌పిటిసిలు, ఎంపిటిసిలు అఖిలపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు.