Apr 25,2023 01:03
అవార్డు అందుకున్న అప్పయ్యచౌదరి

ప్రజాశక్తి-యద్దనపూడి: మండలంలోని పడమట పెద్దివారిపాలెం గ్రామ పంచాయతీ సోషియల్లీ సెక్యూర్డ్‌ గ్రామంగా ఎన్నికయింది. ఆ గ్రామ సర్పంచ్‌ కె అప్పయ్య చౌదరికి సోమ వారం 30వ జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా అవార్డును పంచాయతీ రాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్‌ సూర్యకుమారి ప్రదానం చేశారు. అవార్డుల కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్లు సుధాకర్‌, సూర్యనారాయణ పాల్గొన్నారు. అవార్డు అందుకున్న అప్పయ్యచౌదరిని ఎంపిడిఒ కృష్ణకుమారి, పరిపాలనాధికారి దక్షిణామూర్తి, ఎంపిడిఒ కార్యాలయ సిబ్బంది అభినందించారు.