ప్రజాశక్తి - ముదినేపల్లి
మండలంలోని వణుదుర్రు గ్రామ పంచాయతీ సర్పంచి పదవికి జరగనున్న ఎన్నికకు సంబంధించి గురువారం తొమ్మిది నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి షేక్ జరీనా తెలిపారు. మండలంలోని పెయ్యేరు పంచాయతీ రెండో వార్డు సభ్యుని ఎన్నికకు సంబంధించి మూడు నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రత్నసునందా తెలిపారు. 11వ తేదీ నామినేషన్ల పరిశీలన జరగనుంది. వైసిపి బలప రచిన అభ్యర్థిగా చిన్నం సుగుణబాబు, పార్టీ నేతలతో కలిసి వెళ్లి తన నామినేషన్ దాఖలు చేశారు.
ముసునూరు :మండల కేంద్రమైన ముసునూ రులో వార్డు మెంబర్ పోటీకి టిడిపి, వైసిపి అభ్యర్థులు నామినేషన్ వేసినట్లు పోలీంగ్ రిటర్నింగ్ అధికారి కోటగిరి మురళీ తెలిపారు. ముసునూరు 11వ వార్డు మెంబర్ పోటీకి టిడిపి అభ్యర్ధిగా కలపాల నలోమియా, వైసిపి అభ్యర్థిగా వనిత, డమ్మీ అభ్యర్థిగా బుల్లా నిర్మల నామినేషన్ పత్రాలు అందించినట్లు తెలిపారు. కాట్రేనిపా డులో పదో వార్డుకు టిడిపి తరపున ఇద్దరు అభ్యర్థులు, వైసిపి తరపున ఇద్దరు అభ్యర్థులు నాలుగు నామినేషన్లు అందించారు. వేల్పుచర్ల పదో వార్డుకు వైసిపి తరపున ఒక అభ్యర్థి మాత్రమే నామినేషన్ వేసినట్లు తెలిపారు.
జంగారెడ్డిగూడెం :మండలంలోని శ్రీనివాసపురం గ్రామ పంచాయతీ సర్పంచి ఎన్నికకు గురవారం నామినేషన్లు దాఖలయ్యాయి. వైసిపి తరపున యడ్లపల్లి రాధిక, యడ్లపల్లి సత్యవతి, టిడిపి తరపున జొన్నకూటి శ్రీనివాసరావు, తడికల మోహనబాబు నామినేషన్లు వేశారు. అభ్యర్థులు నామినేషన్ల పత్రాలను శ్రీనివాసపురం సచివాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి డి.సురేష్‌కి అందించారు.










