
ప్రజాశక్తి - కాళ్ల
దొడ్డనపూడిలో సర్పంచి కొల్లి సుబ్బారావు భాస్విని ట్రస్ట్ ద్వారా కందుల లక్ష్మి పేద కుటుంబానికి ఒక ఇల్లును నిర్మించి ఇవ్వడం అభినందనీయమని జుత్తిగ నాగరాజు అన్నారు. దొడ్డనపూడిలో కొల్లి సుబ్బారావు నిర్మించిన ఇల్లును జుత్తిగ నాగరాజు ఆదివారం ప్రారంభించారు. పేద కుటుంబానికి ఒక ఇల్లు నిర్మించడం సర్పంచి సేవ గుణానికి నిదర్శనం పలువురు వక్తలు అన్నారు. కందుల లక్ష్మి భర్త చనిపోవడంతో ఆమె తాటాకింట్లో నివాసం ఉంటుంది. ఆమె పరిస్థితిని గ్రామ సర్పంచి కొల్లి సుబ్బారావు గమనించి సుమారు రూ.మూడు లక్షలతో ఇల్లు నిర్మించి ఇచ్చారు. ట్రస్టు ద్వారా పేద ప్రజలకు ప్రతినెలా ఆర్థిక సాయం చేయడంతో పాటు వృద్ధాప్య పింఛన్లు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో దొడ్డనపూడి సర్పంచి కొల్లి సుబ్బారావు, మాజీ ఎంపిపి ఆరేటి వెంకట రత్నప్రసాద్, ఎరుబండి రామాంజనేయులు, కాళ్ల సర్పంచి బందా విజయ పండు, ఎంపిటిసి సభ్యులు పన్నాసి సూర్యకుమారి, సత్యనారాయణ, మేక మహంకాళి, ఒగిరాల రాజేష్, ఇర్రింకి జగన్, ఆరేటి దిలీప్, నిమ్మకాయల సాయికుమార్, కొల్లిపరశురామయ్య, కొల్లి శ్రీనివాస్, ఎంపిటిసి మాజీ సభ్యులు కందులపాటి వీర రాఘవులు, మేక వీరస్వామి పాల్గొన్నారు.