Nov 06,2023 23:07

శ్రమజీవులకు అండగా ఎర్రజెండ

శ్రమజీవులకు అండగా ఎర్రజెండ
ప్రజాశక్తి - ఓజిలి
శ్రమజీవులకు ఎల్లవేళలా అండగా నిలిచి, పేదలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ.శ్రమజీవుల హక్కుల కోసం సిపిఎం ఉద్యమిస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు అన్నారు. మండల పరిధిలోని మాచవరం గ్రామంలో సిపిఎం పార్టీ జెండా ఆవిష్కరణ చేసి బాణా సంచా కాల్చారు. ఈ సందర్బంగా వందవాసి నాగరాజు మాట్లాడుతూ మాచవరం గ్రామంలో భూ సమస్య ప్రధానంగా ఉందని, పేదలకు భూమిపై శాశ్వత హక్కు కల్పించే వరకు సిపిఎం పోరాడుతుందని తెలిపారు. పరిశ్రమ పేరుతో పేదల నుండి బలవంతంగా భూసేకరణ జరపడం సరైన విధానం కాదని హితవు చేశారు. రాష్ట్రంలో వైసిప,ి కేంద్రంలో బిజెపి కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్నారని దుయ్యబట్టారు. ఓజిలి మండలంలో వందలాది ఎకరాలను భూస్వాములు అక్రమంగా ఆక్రమించుకుని ఆ భూములను అసైన్మెంట్‌ కమిటీకి పంపించి పట్టాలు పొందేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ భూములను స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ప్రధాన సమస్యలు గాలికి వదిలేసి టిడిపి, వైసిపిలు ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం తగదని హితవు పలికారు. ప్రజా సమస్యల్ని రాజకీయ అజెండాగా మారుస్తూ నవంబర్‌ 15 విజయవాడలో జరిగే ప్రజారక్షణ భేరి సభను ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు చాపల వెంకటేశ్వర్లు , శివకవి ముకుంద, వెంకటగిరి సిపిఎం నేత వడ్డిపల్లి చెంగయ్యా ,చేజర్ల చంద్రకళ ,పద్మమ్మ, గురవయ్య ,పండయ్య పాల్గొన్నారు.