Oct 22,2023 19:54

శ్రమదానంతో సిపిఎం స్థూపం ఆధునీకరణ

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
   శ్రమదానంతో స్థానిక రాజీవ్‌ నగర్‌లోని సిపిఎం స్థూపానికి ఆ ధునీకరణ పనులు చేపట్టారు. సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆ దివారం రాజీవ్‌ నగర్‌ సిపిఎం స్థూపం వద్ద పట్టణ కమిటీ సభ్యులు శ్రమదానం చేశారు. డివైఎఫ్‌ఐ సభ్యులు మాబు సుభాని ఆర్థిక సహకారంతో సిపిఎం జెండా స్థూపానికి రైలింగ్‌ నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కమిటీ కార్యదర్శి పసల సూర్యారావు మాట్లాడుతూ పేదల పార్టీ అయిన సిపిఎం స్థూపం ఆధునీకరణకు సహకారం అందించిన సుభానికి కృతజ్ఞతలు తెలిపారు అలాగే స్థూపం ఆధునీకరణ పనులకు సహకారం అందించిన కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో వంగ గోపి, చల్లారి మాణిక్యాలరావు, తదితరులు పాల్గొన్నారు.