రోడ్డు పనులు చేపడుతున్న గిరిజనులు
ప్రజాశక్తి-అనంతగిరి:మండలంలోని కొండిబ పంచాయతీ పరిధి బోరింగ్‌వలస, జామగుడ గిరిజన ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రోడ్డు పనులను చేపట్టారు. రోడ్డు మార్గంలో బండలను తొలగించారు. సుమారు 60.వేలల ఖర్చుతో శ్రమదాన పనులు నెల రోజుల నుండి పనులు చేస్తున్నారు. తమ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని సంబంధిత శాఖల అధికారులకు పలుమార్లు లిఖితపూర్వకంగా విన్నవించినప్పటికీ పట్టించుకోలేదని గిరిజనులు తెలిపారు.తక్షణమే ప్రభుత్వం స్పందించి పూర్తి స్థాయి రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజనులు కోరారు.










