పనులు చేస్తున్న గ్రామస్తులు
ప్రజాశక్తి-అనంతగిరి:మండలంలోని పినకోట పంచాయతీ రాచకిలం గ్రామానికి చెందిన గిరిజనులు చేయి కలిపి రోడ్డు మరమ్మతు పనులు సోమవారం చేపట్టారు. రాచకిలం గ్రామానికి చేరాలంటే పినకోట మెయిన్ రోడ్డు నుండి 10 కిలో మీటర్లు కాలినడకన వెళ్ళవలసి వస్తుంది.ఈ రహదారి మీదుగా పిన్నకోట పంచాయతీ రాచకిలం, గుమ్మంతి, పాలబంధ గ్రామాలు ఆనుకొని ఉన్నాయి. ఈ గ్రామాలు దాటుకొని రాచకిలం గ్రామానికి చేరవలసి ఉంటుంది. రోడ్డు సౌకర్యం కల్పించాలని అనేకసార్లు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు చేపట్టినా అధికారులు పట్టించుకోక పోవడంతో గిరిజన ప్రజలు స్వచ్చందంగా ముందుకు కదిలి శ్రమధానంతో రోడ్డు పనులు చేపట్టారు. వార్డ్ మెంబర్ జమరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు










