
శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదోయ్ ... అన్నాడు మన మహాకవి శ్రీశ్రీ. ఫొటోలంటే అవి మతడ నలగని బట్టలతోనే ఉండాలా ? చెదరని జుట్టుతోనే దిగాలా ? ... అలా కానే కాదు అనుకున్నారు కాబోయే ఆ దంపతులిద్దరూ. ప్రీ వెడ్డింగ్ ఫొటో సూట్‌లో 'ఓ ఇల్లు కట్టుకుందాం.. ఆనక పెళ్లి చేసుకుందాం..' అన్న లెవల్లో ఇలా శ్రమైక సౌందర్యం వొలకబోశారు. ప్రేమలొలుకు సన్నిధి ఉండగా ... శ్రమ కూడా సౌందర్యమేనోయి అంటున్నారు ఈ కేరళ జంట కోతనార్, సిద్ధార్థ. కాస్త కనులారా వీక్షించి, మీ శుభాకాంక్షలు కూడా కురిపించేయండి మరి !

