శిక్షణా తరగతుల్లో మాట్లాడుతున్న ఎంపిపి శారదా ప్రియాంక
ప్రజాశక్తి -ఆనందపురం : విద్యార్థులకు సరళమైన రీతిలో బోధనను అందించడానికి ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ఎంతగానో దోహదపడతాయని ఆనందపురం ఎంపిపి డాక్టర్ మజ్జీ శారద ప్రియాంక తెలిపారు. చందక ప్రాథమిక పాఠశాలలో టిఎఆర్‌ఎల్ ఉపాధ్యాయులకు గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. విద్యార్థులకు తెలుగు, గణితం చక్కగా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మండల విద్యాశాఖ అధికారి పద్మావతి మాట్లాడుతూ, శిక్షణా కార్యక్రమాన్ని ఉపయోగించుకొని పాఠశాలలో మంచి మార్పు తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటు నమోదుకు దరఖాస్తు ఫారాలను ఉపాధ్యాయులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గంగాధర్, వైసిపి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మజ్జి వెంకటరావు పాల్గొన్నారు.










