Aug 03,2023 21:21

ప్రజాశక్తి - తణుకు
రాష్ట్ర చేనేత కార్పొరేషన్‌ మాజీ ఛైర్‌ పర్సన్‌ వావిలాల సరళాదేవి పుట్టినరోజు సందర్భంగా గురువారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత ఆమె నివాసంలో కేక్‌ కట్‌చేసి అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బొమ్మల వీధిలోని ఉచిత కుట్టు మిషన్‌ శిక్షణా శిబిరాన్ని సరళాదేవి దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద మహిళలకు టైలరింగ్‌ వర్క్‌ ఉచితంగా నేర్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే డంపింగ్‌ యార్డు వద్ద ఉన్న నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అంబనాంబ ఆశ్రమంలోని 15 మంది మహిళలకు చీరలు, పండ్లు, భోజనాలు పంపిణీ చేశారు. అలాగే 20 మంది యువకులు రక్తదానం చేశారు. మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా లయన్స్‌ గవర్నర్‌ గట్టి మాణిక్యాలరావు, నైస్‌ నాయకులు కె.మురళి చీకటి శ్రీనివాస్‌, కరుటూరి శేషగిరి, బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు వర్తనపల్లి కాశి పాల్గొన్నారు.