
ప్రజాశక్తి - గణపవరం
స్థానిక పిహెచ్‌సి పరిధిలోని సరిపల్లిలో గురువారం ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ పి.సంతోష్‌నాయుడు 192 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందజేశారు. అనంతరం గణపవరం జిల్లా పరిషత్ హై స్కూల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో 350 మంది బాలబాలికలకు కంటి పరీక్షలు చేశారు. వీరిలో 31 మందికి కళ్లజోళ్లు పడతాయని డాక్టర్ శ్రీనివాస్ చెప్పారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఒ జాలాది విల్సన్ బాబు, ఎంఎల్‌హెచ్ పి.మౌనిక, ఎఎన్‌ఎం ఎన్.నాగవేణి పాల్గొన్నారు.