
క్రోసూరు: సిపిఎం ప్రజా రక్షణ భేరి కార్యక్రమం ఐదో రోజు మండలంలోని పెరికపాడు, దొడ్లేరు, అనంతవరం, విప్పర్లలో ఆది వారం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.రవిబాబు మాట్లాడుతూ పెరిగిన ధరల కారణంగా జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణం పేదలకు భారంగా మారిందని అన్నారు. ఈ కాలనీలో ఇంటి నిర్మాణం నిమిత్తం ఇస్తున్న నాలుగు ట్రక్కులు ఇసుక చాలక అదనంగా మరో నాలుగు టక్కులు అవసరం పడుతోందని, ఒక్కో ట్రక్కు కు రూ.5000 నుండి రూ.7000 వరకు అదనంగా ఇచ్చి కొనుగోలు చేయాల్సి వస్తోం దని అన్నారు. జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణానికి సరిపడా మొత్తం ఇసుక ఉచితంగా ఇవ్వాలని, ఒక్కో ఇంటి నిర్మా ణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మండలంలోని తాళ్లూరు, అనంతవరం, విప్పర్లలోని గోవిందపురం జగనన్న కాలనీలో ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదని అన్నారు. ఇల్లు కట్టించి ఇస్తా మన్న జగన్ హామీని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు గ్రామాల్లో ఇంటింటికి కుళాయి పథకం ప్రచారానికే పరిమితమైం దని విమర్శించారు. కుళాయిలు ఏర్పాటు చేసేందుకని పగలగొట్టిన సిమెంట్ రోడ్లను బాగు చేయలేదని, కుళాయిల ద్వారా సరిగ్గా తాగునీరు రావడంలేదని అన్నారు. సరిగా తాగునీరు అందే విధంగా అధి కారులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి టి.హనుమంతరావు, ఎ.ఆంజనేయులు, ఏపూరి వెంకటేశ్వర్లు, ఎం.పౌలు,సిహెచ్ యేషయ్య, జి.మహేష్, డి.నటరాజ్ పాల్గొన్నారు.
కరపత్రాల పంపిణీ
ముప్పాళ్ల: ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15వతేదిన విజయవాడలో జరిగే ప్రజా రక్షణ భేరి బహిరంగసభను, ఈ నెల 7 వతేదిన సతైనపల్లిలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం ముప్పాళ్ల మండల కార్యదర్శి గుంటుపల్లి బాలకృష్ణ పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా మాద లలో ఆదివారం కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బాల కృష్ణ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసి , అధికార పీఠాన్ని కాపాడుకునేందుకు పాకులాడు తున్నాయని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ ఛార్జీలు పెరిగి పోయాయని, పేదలు ఏదీ కొనుగోలు చేసే పరిస్థితి లేదని అన్నారు. కార్య క్రమంలో కె.సాంబశివరావు, ఎం. వెం కటరెడ్డి, జి.జాలయ్య, పఠాన్ సైదాఖాన్, సిహెచ్ నాగమల్లేశ్వరరావు, కె.నాగే శ్వరరావు, టి.బ్రహ్మయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.