శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు జడ్జి
ప్రజాశక్తి- తిరుమల: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సోమవారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శన అనంతరం రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం పలుకగా చైర్మన్ కరుణాకర రెడ్డి శాలువతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు, పంచగవ్య ఉత్పత్తులు, స్వామివారి చిత్రపటాన్ని అందించారు.










