ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయానికి యాత్రికుల విరాళాల ద్వారా రూ.1,85,91,793 ఆదాయం లభించిందని ఆలయ ఇఒ వేంద్ర త్రినాథరావు తెలిపారు. దేవస్థానం హుండీలను బుధవారం ఉదయం అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ లెక్కించారు. ఈ లెక్కింపులో నగదు రూపేణా పైన పేర్కొన్న మొత్తం, బంగారం 155 గ్రాములు, వెండి ఐదు కేజీల 25 గ్రాములు, పాత రూ.500 నోట్లు 30, రూ.వెయ్యి నోటు ఒకటి, విదేశీ కరెన్సీ సైతం లభించినట్లు ఇఒ తెలిపారు. 20 రోజులకు గాను ఈ ఆదాయం లభించిందన్నారు.










