Sep 17,2023 22:24

శ్రీవారి దర్శనానికి మాజీ రాష్ట్రపతి
ప్రజాశక్తి- తిరుమల: భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శ్రీవారి దర్శనార్థం ఆదివారం మధ్యాహ్నం కుటుంబ సమేతంగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రోడ్డుమార్గంలో తిరుమలకు చేరుకున్నారు. టిటిడి ఈవో ధర్మారెడ్డి ఆయనకు ఘనంగా స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం దర్శన ఏర్పాట్లను చేసినట్లు ఆలయాధికారులు తెలిపారు.