శ్రీసిటీని సందర్శించిన జర్మనీ 'గోట్టింగెన్' విద్యార్థులు
ప్రజాశక్తి - వరదయ్యపాళెం
జర్మనీలోని ప్రముఖ గోట్టింగెన్ విశ్వవిద్యాలయానికి చెందిన 35 మంది అధ్యాపకులు, విద్యార్థుల ప్రతినిధి బందం గురువారం శ్రీసిటీని సందర్శించింది. ప్రొఫెసర్ సబాస్టిన్ నేతత్వంలో సందర్శనకు విచ్చేసిన వారు స్థానిక బిజినెస్ సెంటర్‌లో శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుస్థిర అభివద్ధి లక్ష్యాలతో వేగంగా ముందుకు సాగుతున్న శ్రీసిటీ యొక్క పలు ప్రత్యేకతలను రవీంద్ర సన్నారెడ్డి వారికి వివరించారు. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ పారిశ్రామిక వద్ధిని సాధించడంపై తాము ప్రత్యేక దష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, దేశంలోని అత్యుత్తమ కార్బన్-న్యూట్రల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్‌లలో ఒకటిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. స్థానిక యువత ఉపాధి కల్పన కోసం చేపడుతున్న నైపుణ్యాభివద్ధి చర్యలు, కార్పొరేట్ సామాజిక భాద్యత (సి ఎస్ ఆర్) కార్యక్రమాలు, ఆర్థికంగా వెనుకబడిన పరిసర ప్రాంతాలలో పై కార్యక్రమాలు ద్వారా ఎలాంటి మార్పులు తెచ్చాయన్న అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా విదేశీ విద్యార్థుల ఇంటర్న్‌షిప్‌లకు శ్రీసిటీ తగు సహకారం అందిస్తుందని వారి ఒక ప్రశ్నకు ఎండీ సమాధానమిచ్చారు.పర్యటనలో భాగంగా ప్రతినిధి బందం క్రియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది. ఇంకా చిన్న పాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్యులు, రోగులతో మాట్లాడారు.
శ్రీసిటీని సందర్శించిన గోట్టింగెన్ వర్సిటీ విద్యార్థులు










