Nov 21,2023 21:14

శ్రీసిటీని సందర్శించిన జపాన్‌ బృందం

శ్రీసిటీని సందర్శించిన జపనీస్‌ బృందం
ప్రజాశక్తి - వరదయ్యపాలెం
జపాన్‌లోని ప్రముఖ కార్పొరేషన్‌లు, వివిధ రంగాలలోని వ్యాపార సంస్థలకు చెందిన 25 మంది వ్యాపార ప్రతినిధి బందం శ్రీసిటీని సందర్శించింది. జపనీస్‌ ప్రముఖ ప్రచురణ సంస్థ నిక్కన్‌ కోగ్యో షింబున్‌ ఆధ్వర్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో రెండు రోజుల పాటు పర్యటన సాగింది. ప్రతినిధి బందానికి జమైకాలోని జపాన్‌ మాజీ రాయబారి మసనోరి నకనో, నిక్కన్‌ కోగ్యో షింబున్‌ అధ్యక్షుడు ఇమిజు హరుహిరో నాయకత్వం వహించారు. శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ ఈ పర్యటన నిర్వహించినందుకు నిక్కన్‌ కొగ్యో షింబున్‌కు ధన్యవాదాలు తెలిపారు. శ్రీసిటీ గురించి వివరిస్తూ, ఇక్కడ వ్యాపారానుకూల వాతావరణం, ఇతర వనరుల కారణంగా ప్రపంచంలోని పెట్టుబడిదారులు, ప్రత్యేకించి జపనీస్‌ కంపెనీలు శ్రీసిటీని తమ గమ్యస్థానంగా ఎంచుకుంటున్నాయన్నారు. దేశంలో జపాన్‌ కంపెనీలకు రెండో అతిపెద్ద పెట్టుబడి గమ్యస్థానంగా శ్రీసిటీ నిలిచిందన్నారు. నిక్కన్‌ కోగ్యో యొక్క వనరులు, నెట్‌వర్క్‌, అనుభవం తప్పక జపాన్‌ లోని ఇతర ప్రముఖ పెట్టుబడిదారులకు శ్రీసిటీ ప్రత్యేకతలను పరిచయం చేస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
శ్రీసిటీని సందర్శించిన జపాన్‌ బృందం