శ్రీసిటీని సందర్శించిన 'జాగృతి జి20 స్టార్టప్ 20' యాత్రా బృందం
ప్రజాశక్తి- వరదయ్యపాలెం: దేశంలోని వివిధ రాష్ట్రాలు, జి20 దేశాలకు చెందిన సుమారు 520 మంది 'జాగృతి జి20 స్టార్టప్ 20 యాత్ర' బృంద సభ్యులు బుధవారం శ్రీసిటీ సందర్శించారు. ఔత్సాహక పారిశ్రామికవేత్తలను తయారు చేసే లక్ష్యంతో జాగతి సేవా సంస్థాన్ స్వచ్చంద సంస్థ ఏటా చేపట్టే ఈ జాగృతి యాత్ర, ప్రత్యేక రైలు ప్రయాణం ద్వారా దేశమంతా పర్యటించి, వివిధ రంగాలలో ఆదర్శవంతులను (రోల్ మోడల్‌లు) కలుసుకుని వారితో సంభాషించడం ద్వారా యాత్రికులలో స్ఫూర్తిని నింపుతుంది. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి బృందానికి స్వాగతం పలికారు. జాగతి యాత్ర బందం శ్రీసిటీకి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం 28 దేశాల నుండి 210 పైగా కంపెనీలు శ్రీసిటీలో పెట్టుబడి పెట్టాయన్నారు. ఆటోమోటివ్, లోకోమోటివ్స్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్స్, ఎఫ్‌ఎంసీజీ, ఫుడ్ ప్రాసెసింగ్, వేర్‌హౌసింగ్ ఇతర పలు విభాగాలకు చెందిన పరిశ్రమలు ఇందులో ఉన్నాయని తెలిపారు. కార్బన్-న్యూట్రల్ తయారీ కేంద్రంగా గుర్తింపు పొందాలనే లక్ష్యంతో పలు పర్యావరణ హిత కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు స్థిరమైన పర్యావరణ వ్యవస్థ ఏర్పాటు కోసం చిత్తశుద్ధితో కషి చేస్తున్నట్లు వివరించారు. తమ బందానికి సందర్శన అవకాశం కల్పించిన శ్రీసిటీ యాజమాన్యానికి జాగతి సంస్థ సీఈఓ అశుతోష్ కుమార్ ప్రత్యేక కత్ఞతలు తెలిపారు. 'ఔత్సాహక పారిశ్రామికవేత్తలతో దేశ నిర్మాణం' లక్ష్యంగా భారతదేశంలో 15 ఏళ్ల నుంచి జాగృతి యాత్ర నిర్వహిస్తు న్నారు. ఈ ఏడాది జి20 స్టార్టప్20 భాగస్వామ్యంతో జి20 ఢిల్లీ డిక్లరేషన్ మేరకు ప్రపంచ అంకుర సంస్థల పర్యావరణం దిశగా యువతను ప్రోత్సహిస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్మాల్ ఇండిస్టీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో 14 రోజుల పాటు 8000 కిమీ రైలు ప్రయాణం ఈ యాత్రలో కొనసాగుతుంది. 2008 నుండి 7500 మంది భారతీయ, అంతర్జాతీయ యువతను ఈ యాత్ర ప్రభావితం చేసింది. దేశంలోని టైర్ 2, టైర్ 3 జిల్లాలను ప్రధానంగా పరిగణనలోనికి తీసుకుని, ఆయా ప్రాంతాలలో పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ స్థాపనపై ప్రత్యేక దష్టి సారించింది.










