Nov 16,2023 20:59

జపాన్‌ రాయబార కార్యాలయ ఆర్థిక మంత్రి క్యోకో హౌకుగో నేతత్వంలోని నలుగురు రాయబార కార్యాలయ ఉన్నతాధికారుల బందం

శ్రీసిటీలో జపాన్‌ రాయబార బృందం
ప్రజాశక్తి - వరదయ్యపాళెం
భారత్‌లోని జపాన్‌ రాయబార కార్యాలయ ఆర్థిక మంత్రి క్యోకో హౌకుగో నేతత్వంలోని నలుగురు రాయబార కార్యాలయ ఉన్నతాధికారుల బందం గురువారం శ్రీసిటీని సందర్శించింది. ఆర్థిక మంత్రితో పాటు ఎంబసీ ప్రథమ కార్యదర్శులు మసాహిరో కవాకమి, జునిచిరో సుజుకి, చెన్నైలోని జపాన్‌ కాన్సులేట్‌ అధికారి నవోకో యుజావా ఈ పర్యటనలో పాల్గొన్నారు. శ్రీసిటీ ప్రెసిడెంట్‌ (ఆపరేషన్స్‌) వారికి సాదర స్వాగతం పలకగా, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (మార్కెటింగ్‌) ఆర్‌.శివశంకర్‌ వారికి శ్రీసిటీ ప్రపంచశ్రేణి మౌళిక సదుపాయాలు, పారిశ్రామిక ప్రగతి, ప్రత్యేకతలను వివరించారు. శ్రీసిటీ వ్యాపార సామర్థ్యం, పరిశ్రమ అనుకూల వాతావరణం పట్ల క్యోకో హౌకుగో సంతప్తి వ్యక్తం చేశారు. శ్రీసిటీ వ్యాపార సామర్థ్యాన్ని జపనీస్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగానికి పరిచయం చేసి, ఇక్కడ మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు సిఫార్సు చేస్తామన్నారు. జపాన్‌ రాయబార కార్యాలయ ఆర్థిక మంత్రి నేతత్వంలోని అధికారుల బందం శ్రీసిటీ సందర్శన పట్ల శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి తన సందేశంలో సంతోషం వ్యక్తం చేశారు.