శ్రీశైల క్షేత్రంలో మంత్రి అంబటి
ప్రజాశక్తి - శ్రీశైలం
శ్రీశైలం క్షేత్రాన్ని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సమేతంగా బుధవారం సందర్శించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. మంత్రి కుటుంబ సమేతంగా ఆలయ రాజగోపురం వద్దకు చేరుకోగానే దేవస్థానం కార్యనిర్వహణాధికారి లవన్న, ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు, వేద పండితులు సాంప్రదాయపదంగా స్వాగతం పలికారు. అనంతరం మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత భ్రమరాంబ దేవిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని వేద ఆశీర్వచనం మండపంలో వీరికి వేద పండితులు ఆశీర్వచనం పలికారు. శేష వస్త్రాలను, ప్రసా దాలను, జ్ఞాపికను దేవస్థానం ఈవో అందజేశారు.
శ్రీశైలం డ్యామ్‌ను సందర్శన
శ్రీశైలం ప్రాజెక్టు : మంత్రి అంబటి రాంబాబు స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం శ్రీశైలం డ్యామ్‌ను కుటుంబ సమేతంగా సందర్శిం చారు. డ్యాం అధికారులతో నీటి నిల్వలు, పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈయన వెంట ఇరిగేషన్ శాఖ డీఎస్సీ గంగాధర్ రెడ్డి, ఏఇలు నరసింహ, తంగరాజు, ఎస్పీఎఫ్ సిబ్బంది ఉన్నారు.










