Apr 30,2023 17:12

శ్రీరంగం శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న ఉపాధ్యాయులు

శ్రీరంగం శ్రీనివాసరావు జయంతి వేడుకలు
ప్రజాశక్తి-డోన్

       అభ్యుదయ కవి శ్రీరంగం శ్రీనివాసరావు రచయిత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాతపేట ప్రధానోపాధ్యాయురా లు పద్మావతమ్మ తెలిపారు.ఆదివారం పట్టణం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాతపేట ప్రధానోపాధ్యాయులు పద్మావతమ్మ అధ్యక్షతన అభ్యుదయ కవి  శ్రీరంగం శ్రీనివాసరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురా లు పద్మావతమ్మ మాట్లాడుతూ 1910 ఏప్రిల్ 30న పూడిపెద్ది వెంకటరమణయ్య,అప్పలకొండ దంపతులకు జన్మించాడని 1950 లో మహాప్రస్థానం ద్వారా మరో ప్రపంచం పిలిచిందని ఆయన కవిత కుదిరితే పరిగెత్తు లేకపోతే నడువు, అదీ చేతకాకపోతే పాకుతూ పో,  అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు అన్నది ఆయన మాటని,  అల్లూరి సీతా రామ రాజు సినిమాకు ఆయన రాసిన తెలుగు వీర లేవరా అనేది శ్రీశ్రీ రాసిన ఆణిముత్యాల్లో ఒకటని ఈపాటకు జాతీయ పురస్కారం లభించిందని ఆయన సినిమా పాటలు  రచించారని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మొదటి రాజా లక్ష్మీ ఫౌండేషన్ అవార్డు పొందారని 1970లో ఆయన షష్టిపూర్తి ఉత్సవం విశాఖపట్నంలో జరిగిందని ఆ సందర్భంగానే ఆయన అధ్యక్షుడుగా విప్లవ రచయితల సంఘం ఏర్పడిందని కొంతకాలం క్యాన్సరు వ్యాధి బాధకు లోనై 1983 జూన్ 15 న శ్రీశ్రీ మరణించాడని ప్రతినిత్యం తన సాహిత్యం ద్వారా ప్రజలలో నిలిచిన ప్రజాకవి శ్రీ శ్రీ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు వెంకటసుబ్బారెడ్డి,తెలుగు ఉపాధ్యాయులు దేవేంద్రప్ప,లీలావతమ్మ,రాధ, ఆదినారాయణ,శివ ప్రసాద్,వెంకటేశ్వర్ గౌడ్,వెంకటరమణ,సుబ్బారెడ్డి, వెంకట లక్ష్మీ,శ్రీనివాసులు,చంద్రశేఖర్ గౌడ్, లక్ష్మయ్య,అల్లిపీరా,లక్ష్మీకాంత రెడ్డి,మధుసూదన్ రెడ్డి, సుబాన్, రాఘవేంద్ర, సురేష్, మద్దిలేటి, శివన్న, భారతి,రమేష్,సుబ్బరాయుడు,సంజీవరెడ్డి, జయసుబ్బారాయుడు, శ్రీ కళ,లక్ష్మీ ప్రభావతి, రామ్మూర్తి,ప్రసాదరావు, మునిరాజు,మహేష్,అల్లిపీరా తదితరులు పాల్గొన్నారు.