Sep 15,2023 22:30

మాతృపార్టీలో చేరిన సంక్రాంతి, రాపూరు

స్రీపీఎంలోకి సంక్రాంతి, రాపూరు
పార్టీని బలోపేతం చేయాలి : వి.నాగరాజు

పజాశక్తి-శ్రీకాళహస్తి
సీపీఎం మాజీ కార్యకర్తలు సంక్రాంతి వెంకటయ్య, రాపూరు సుబ్రమణ్యంలు తిరిగి వారి మాత పార్టీలో చేరారు. స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవన్‌ లో శుక్రవారం జరిగిన సీపీఎం ప్రాంతీయ నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తల సమాశంలో వారిరువురు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు సమక్షంలో తిరిగి మాత పార్టీలోకి రావడం జరిగింది. ఈ సందర్భంగా వందవాసి నాగరాజు మాట్లాడుతూ దేశంలో రాజకీయ పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాలక ప్రభుత్వాలు కార్పొరేట్ల చేతుల్లో కీలుబొమ్మలవుతున్న నేపథ్యంలో దేశంలో ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, ఆకలి పెచ్చుమీరుతున్నాయని వాపోయారు. ఈ తరుణంలో ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు దేశ ప్రజలు చూస్తున్నారనీ, ఆ ప్రత్యామ్నయం కమ్యూనిస్టులే అవ్వాలని చెప్పారు. సీపీఎంలో చేరుతున్న వారంతా పార్టీ లక్ష్యాల కోసం పనిచేయాలనీ, కార్మిక, కర్షక, బడుగు బలహీన వర్గాల పక్షాన పోరాడాలని పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం పారిశ్రామికంగా దినదినాభివద్ధి చెందుతోందనీ, కర్మాగారాల్లో పని చేస్తున్న కార్మికుల శ్రమను యాజమాన్యాలు దోపిడీ చేస్తున్నాయనీ, వారి పక్షాన పోరాడేందుకు సిపిఎం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. రాపూరు, సంక్రాంతి తో పాటు మరో పది మంది యువకులు చేరారు.నాయకులు అంగేరి పుల్లయ్య, దాసరి జనార్ధన్‌, గంధం మణి, పెనగడం గురవయ్య, కుమార్‌, నాగరాజు, వెంకటేష్‌, రమేష్‌, చెంగయ్య, ముకుంద తదితరులు పాల్గొన్నారు.
మాతృపార్టీలో చేరిన సంక్రాంతి, రాపూరు