
ప్రజాశక్తి - పాలకొల్లు
నెల్లూరుకు చెందిన కోసూరు రత్నం ఛారిట బుల్ ట్రస్ట్, విశాలాక్షి సాహిత్య మాసపత్రిక సంయుక్తంగా నిర్వహించిన జాతీయస్థాయి కవితల పోటీల్లో పాలకొల్లు రసధుని సాహితీ సంస్థ సహాయ కార్యదర్శి ప్రముఖ కవి మామిడిశెట్టి శ్రీనివాస్ రచించిన నగ రుధిర పుష్ఫాలం కవితకు ఉత్తమ కవితా పురస్కారం లభించింది. ఆదివారం రాత్రి నెల్లూరు టౌన్ హాలులో నిర్వహించిన అవా ర్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో 25 కళాసంఘాల అధ్య క్షులు అమరావతి కృష్ణారెడ్డి, ప్రముఖ వైద్యులు జయప్రద, ప్రముఖ రచయిత విమర్శకులు ఎంవి.రామిరెడ్డి, విశాలాక్షి సాహిత్య మాసపత్రిక సంపాదకులు ఈతకోట సుబ్బారావు, కోసూరు రత్నం, పలువురి పెద్దల చేతుల మీదుగా శ్రీనివాస్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ను దొడ్డిపట్ల పిహెచ్‌సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రరేఖ, సిబ్బంది, రసధుని సాహితీ సంస్థ అధ్యక్షులు కొట్టి భాస్కరరావు, ఎన్‌జి ఒ నాయకులు పలువురు సాహితీవేత్తలు అభినందించారు.
రంగరాజు మాస్టర్‌కు జాతీయ పురస్కారం
ఉండి :మండలంలోని చెరుకువాడకు చెందిన సాహితీవేత్త, కవి, ప్రముఖ కార్టూనిస్ట్, లయన్స్‌క్లబ్ వైస్ ప్రెసిడెంట్ గాదిరాజు రంగరాజు మాస్టర్‌కు జాతీయ పుర స్కారం లభించింది. ఇటీవల నెల్లూరులో జరిగిన విశాలాక్షి వృద్దాశ్రమం, విశాలాక్షి మాస పత్రిక వార్షికోత్సవం సంద ర్భంగా నిర్వహించిన కార్టూన్ పోటీలో ఉత్తమ కార్టూనిస్ట్‌గా రంగరాజు జాతీయ పురస్కారం అందుకు న్నారు. 64 కళల సంఘం అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతులు మీదుగా పురస్కారం అందుకున్నట్లు రంగరాజు సోమవారం విలేకరు లకు తెలిపారు. ప్రముఖ రచయత్రి, వైద్యులు డాక్టర్ జయప్రద, ప్రముఖ రచయిత, సాహితీ విమర్శ కులు ఎం.వి.రామిరెడ్డి, విశాలాక్షి సంపాదకులు సుబ్బారావు, ఆశ్రమంవ్యవస్థాపకులు కోసూరు రత్నం, రచయిత చిన్ని నారాయణరావు, రచయిత చంద్రశేఖర్‌శర్మ, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పురస్కార గ్రహీతలు పాల్గొన్నారన్నారు.