Sep 17,2023 22:34

శ్రీనివాస సేతు ప్రతిష్టాత్మక ప్రాజెక్టు
నగర కమిషనర్‌ హరిత
ప్రజాశక్తి- తిరుపతిటౌన్‌:
తిరుపతి నగరానికే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన శ్రీనివాస సేతును ఈనెల 18వ తేదీ సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌ మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం ఎంతో సంతోషదాయకమని తిరుపతి నగరపాలక కమిషనర్‌ హరిత అన్నారు. ఆదివారం ఉదయం ప్రారంభానికి సిద్ధమవుతున్న శ్రీనివాససేతు ప్రాజెక్టు పనులను నగరపాలక కమిషనర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ వివరిస్తూ దాదాపు రూ.650 కోట్లతో 6 కి.మీ నిర్మాణం తిరుపతి స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌, టిటిడి సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. శ్రీనివాససేతు తిరుపతి, తిరుమల యాత్రికులకు, నగర ప్రజలకు అందుబాటులోకి రావడం ఎంతో గర్వకారణంగా భావిస్తున్నామని తెలిపారు.