
సమావేశంలో మాట్లాడుతున్న డిఆర్‌డిఎ పిడి కిరణ్‌కుమార్
ప్రజాశక్తి - కురుపాం : స్రీ నిధి బకాయిల వసూళ్లకు సిసిలు కృషి చేయాలని డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ పి.కిరణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక మండల సమాఖ్య కార్యాలయం వద్ద ఎపిఎం ఇవి కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేడింగ్ పెంపు, స్త్రీ నిధి రికవరీ, స్త్రీ నిధి న్యూ లోన్స్ రిక్వెస్ట్, ఉన్నతి రికవరీ , మహిళా మార్ట్, లోకోస్ యాప్ సంబంధించి పంచాయతీ వారిగా సమీక్షించారు. వైయస్సార్ క్రాంతి పథకం ద్వారా అందుతున్న పథకాలు గూర్చి ప్రతి మహిళకు అవగాహన ఉండాలని అన్నారు. కార్యక్రమంలో మండలంలో గల సీసీలు పాల్గొన్నారు.