Nov 13,2023 19:20

తైలంతో మర్దనం చేస్తున్న పూర్వాశ్రమ కుమారులు

ప్రజాశక్తి - మంత్రాలయం
ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో నరక చతుర్దశి సందర్భంగా పీఠాధిపతులు శ్రీసుభుదేంధ్రతీర్థులు విశేష పూజలు నిర్వహించారు. ఆదివారం దీపావళి పండగ ముందు రోజు నరక చతుర్దశి సందర్భంగా పీఠాధిపతులు తైల అభ్యంగన స్నానం చేసి, శ్రీమఠంలో తులసి పూజ, గోపూజ వంటి విశేష పూజలతో రాఘవేంద్రస్వామి ఆరాధ్య దైవమైన మూల రాముల విగ్రహ మూర్తులను స్వర్ణ పీఠం ఉంచి క్షీరాభిషేకం, పుష్పార్చన చేశారు. అనంతరం రాఘవేంద్రుని మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. అంతకుముందు పీఠాధిపతుల పూర్వాశ్రమ తల్లి మంజులమ్మ, పూర్వాశ్రమ కుమారులు రాజా ఎస్‌.అప్రమేయాచార్‌ తైలంతో తలకు మర్దనం చేశారు.