Apr 22,2023 19:28

ఆలయ ప్రాంగణంలో ఉన్న జ్యోషి

ప్రజాశక్తి - మంత్రాలయం
ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో కొలువైన శ్రీరాఘవేంద్రస్వామిని కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జ్యోషి శనివారం దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయం చేరుకున్న ఆయనకు శ్రీమఠం మేనేజర్‌ ఎస్‌కె.శ్రీనివాసరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గ్రామ దేవత మంచాలమ్మను, రాఘవేంద్రుని మూల బృందావనాన్ని దర్శించుకుని మంగళ హారతులు స్వీకరించారు. అనంతరం శ్రీమఠం పీఠాధిపతులు శ్రీసుభుదేంధ్రతీర్థులు ఆయనకు శేష వస్త్రం, ఫల మంత్రాక్షతలు, మెమొంటో అందజేసి ఆశీర్వదించారు. దర్శనార్థం మంత్రాలయం చేరుకున్న ఆయనకు ఎస్‌ఐ వేణుగోపాల్‌ రాజు ఆధ్వర్యంలో తగిన భద్రత కల్పించారు.