ప్రజాశక్తి - మంత్రాలయం
ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో మృత్తికా సంగ్రహణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సోమవారం ఆషాడ శుద్ధ పూర్ణిమ సందర్భంగా మృత్తికా సంగ్రహణ మహోత్సవం నిర్వహించారు. పీఠాధిపతులు శ్రీసుభుదేంధ్రతీర్థులు ఆధ్వర్యంలో రాఘవేంద్రస్వామి సన్నిధిలో పండితుల వేద మంత్రాలు, మంగళ వాయిధ్యాల నడుమ శ్రీమఠం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. పవిత్ర తుంగభద్ర నది తీరంలో తులసీ వనంలో విశేష పూజలు నిర్వహించారు. అక్కడి మృత్తిక (మట్టి)ను పళ్లెంలో ఉంచి స్వర్ణ పల్లకిలో ఉంచి మృత్తికను సేకరించారు. అనంతరం శ్రీరాఘవేంద్ర స్వామి మూల బృందావనం వద్ద నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో బృందావనంపై ఉంచిన మృత్తికను తొలగించి పౌర్ణమి సందర్భంగా సేకరించిన మృత్తికను ఉంచి మంగళ హారతులు ఇచ్చారు. శ్రీమఠం మేనేజర్లు ఎస్‌కె.శ్రీనివాసరావు, వెంకటేష జ్యోషి, ఆధ్యాత్మిక అభివృద్ధి అధికారి శ్రీపతి ఆచార్, సహాయక పిఆర్‌ఒ హొన్నొళ్లి వ్యాసరాజాచార్ పాల్గొన్నారు.
పూజలు నిర్వహిస్తున్న పీఠాధిపతులు










