వెండి చెంబు అందజేస్తున్న దాతలు
ప్రజాశక్తి - మంత్రాలయం
ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన శ్రీరాఘవేంద్ర స్వామి మఠానికి అష్ట లక్ష్మీ రూపాలు గల వెండి చెంబును భక్తులు విరాళంగా అందజేసినట్లు శ్రీమఠం మేనేజర్ ఎస్‌కె.శ్రీనివాసరావు తెలిపారు. శనివారం రాఘవేంద్ర స్వామి దర్శనార్థమై కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన రాఘవేంద్ర పండరు కుటుంబ సభ్యులతో కలిసి మంత్రాలయం వచ్చారు. గ్రామ దేవత మంచాలమ్మను, రాఘవేంద్రుని మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. అనంతరం శ్రీమఠం పరిపాలనా కార్యాలయంలోని మేనేజర్ ఎస్‌కె.శ్రీనివాసరావును కలుసుకుని 531 గ్రాములు గల రూ.44,410 విలువ చేసే వెండి చెంబును విరాళంగా ఇచ్చారు. పీఠాధిపతులు శ్రీసుభుదేంధ్ర తీర్థులు ఆదేశాల మేరకు మేనేజర్ శ్రీనివాసరావు వారికి మెమొంటో అందజేసి ఆశీర్వదించారు.