
శ్రీలంక 2007 నుంచి విదేశీ బాండ్ల రూపంలో రూపంలో తీసుకున్నది 35 బి.డాలర్ల (ఇది 51 బి.డాలర్లని కొందరు చెప్పారు) మొత్తం విదేశీ అప్పులో 47 శాతం ఉంది. దీనిలో ఎక్కువ భాగం డాలర్లుగా చెల్లించాల్సింది ఉంది. ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు నుంచి 14.3 శాతం, జపాన్ నుంచి 10.9, చైనా నుంచి తీసుకున్నది 10.8 శాతం ఉంది. మిగతా రుణాలను మన దేశం, ప్రపంచబ్యాంకు, ఇతర సంస్ధలు, దేశాల నుంచి తీసుకున్నది. శ్రీలంక బాండ్ల రుణాల్లో ఎక్కువ మొత్తం అమెరికా సంబంధిత సంస్ధల నుంచి తీసుకున్నదే, అంటే వాటిలో మదుపు చేసే వారందరూ అమెరికన్లే, ఆ రీత్యా ఎక్కువ అప్పులిచ్చింది అమెరికానే కదా!
శ్రీలంక తీవ్రమైన విదేశీ రుణ చెల్లింపుల సంక్షోభంలో ఉంది. దాంతో జన జీవితం అతలాకుతలం అవుతున్నది. రాజకీయ అశాంతి నెలకొంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ (ఐఎంఎఫ్) నుంచి రుణం తీసుకొని చెల్లింపుల సమస్య నుంచి బయటపడేందుకు పూనుకుంది. అసలు లంకలో ఇలాంటి పరిస్ధితి తలెత్తటానికి కారణం ఏమిటి అనే చర్చ జరుగుతోంది.
ఈ ఏడాది విదేశీ అప్పులకు గాను లంక చెల్లించాల్సిన కిస్తీ 4.5 బి.డాలర్లు. గడువు లోగా చెల్లించకపోతే దివాలా తీసినట్లు భావిస్తారు. ఇదిగాక దిగుమతులు, ఇతర అవసరాలకు మరో 20 బి.డాలర్లు అవసరం అని అంచనా. శ్రీలంక 2007 నుంచి విదేశీ బాండ్ల రూపంలో రూపంలో తీసుకున్నది 35 బి.డాలర్ల (ఇది 51 బి.డాలర్లని కొందరు చెప్పారు) మొత్తం విదేశీ అప్పులో 47 శాతం ఉంది. దీనిలో ఎక్కువ భాగం డాలర్లుగా చెల్లించాల్సింది ఉంది. ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు నుంచి 14.3 శాతం, జపాన్ నుంచి 10.9, చైనా నుంచి తీసుకున్నది 10.8 శాతం ఉంది. మిగతా రుణాలను మన దేశం, ప్రపంచబ్యాంకు, ఇతర సంస్ధలు, దేశాల నుంచి తీసుకున్నది. శ్రీలంక బాండ్ల రుణాల్లో ఎక్కువ మొత్తం అమెరికా సంబంధిత సంస్ధల నుంచి తీసుకున్నదే, అంటే వాటిలో మదుపు చేసే వారందరూ అమెరికన్లే, ఆ రీత్యా ఎక్కువ అప్పులిచ్చింది అమెరికానే కదా! గతేడాది డిసెంబరు ఆఖరు నాటికి లంక వద్ద 3.1 బి.డాలర్ల విదేశీ మారక ద్రవ్యం ఉంటే దానిలో చైనా సర్దుబాటు చేసి మొత్తం 1.5 బి.డాలర్లుంది. వాస్తవాలు ఇలా ఉంటే చైనా కారణంగా శ్రీలంక ఇబ్బందులు పడుతున్నదని ఎలా చెబుతారు?
చైనా నుంచి శ్రీలంక ఎందుకు రుణాలు తీసుకుందన్నది అసక్తికరం. శ్రీలంక లోని హంబంటోటా రేవును చైనా నిధులతో అభివృద్ధి చేశారు. రుణాన్ని లంక సర్కార్ చెల్లించకపోవటంతో ఆ రేవును 99 సంవత్సరాలకు చైనా కౌలుకు తీసుకోవటం ఆక్రమించటమే కదా, బిఆర్‌ఐ పేరుతో అనేక దేశాలను ఇలానే ఆక్రమిస్తున్నది అని చెబుతారు. ఇదంతా అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మీడియా కట్టుకథ.
హంబంటోటా రేవు నిర్మాణం కోసం భారత్, అమెరికాలతో పోలిస్తే చైనాతో లావాదేవీలు మెరుగైనవిగా ఉండటమే కారణమని అమెరికాకు చెందిన అట్లాంటిక్ పత్రిక పేర్కొన్నది. 2007లో లంక తొలుత ఈ రెండు దేశాలనే పెట్టుబడులు, రుణాలను కోరగా అవి తిరస్కరించాయి. 2009లో లంకలో అంతర్యుద్ధం ముగిసింది. ఆర్థిక రంగం ఇబ్బందుల్లో పడటంతో విదేశాల నుంచి రుణాలు తీసుకోవటం ప్రారంభించింది. పదిహేను సంవత్సరాల వ్యవధి ఉన్న 30.7 కోట్ల డాలర్ల రుణాలను 6.3 శాతం వడ్డీతో చైనా ఇచ్చింది. తరువాత చైనా నుంచే మరో 75.7 కోట్ల డాలర్లను రెండు శాతం వడ్డీతో లంక తీసుకుంది. విదేశీ చెల్లింపుల సమస్యను అధిగమించేందుకు 2018లో చైనా అభివృద్ధి బ్యాంకు నుంచి వంద కోట్ల డాలర్లను ఎనిమిదేళ్లలో తిరిగి చెల్లించే ప్రాతిపదికన లండన్ ఇంటర్ బ్యాంక్ రేటు (లిబోర్) ప్రకారం 2.56 శాతానికి తీసుకుంది. తరువాత 2020 మార్చినెలలో అంతకు ముందు కంటే తక్కువ వడ్డీకి అదే బ్యాంకును మరో 50 కోట్ల డాలర్లు తీసుకుంది. ఈ ఏడాది మరో 150 కోట్ల డాలర్ల రుణం తీసుకుంది. చైనా మెరుగైన షరతులతో రుణాలు ఇవ్వటం వల్లనే దానివైపు లంక మొగ్గినట్లు ఈ లావాదేవీలు వెల్లడిస్తున్నాయని అట్లాంటిక్ పేర్కొన్నది.
హంబంటోటా రేవు ద్వారా ఆశించిన మేరకు ఆదాయం రాకపోవటం, 2015 నాటికి రుణ కిస్తీ చెల్లించకలేకపోవటంతో 70 శాతం వాటాలను చైనా కంపెనీకి విక్రయించింది. తరువాత రేవు, పరిసరాల్లో ఉన్న 15 వేల ఎకరాల భూమిని 99 సంవత్సరాల కౌలుకు ఇచ్చింది.
చైనాతో నిమిత్తం లేకుండానే హంబంటోటా రేవును అభివృద్ధి చేసేందుకు లంక సర్కార్ నిర్ణయించింది. దాన్ని తొలుత ప్రోత్సహించింది చైనా కాదు, కెనడా. దశాబ్దాలుగా ఆ ప్రతిపాదన ఉంది. తాము అధికారానికి వస్తే రేవు నిర్మాణం చేస్తామని యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ పార్టీ 2001 ఎన్నికల్లో వాగ్దానం చేసింది. ఆ మేరకు ప్రభుత్వం 2002లో కెనడియన్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఏజన్సీకి సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందించే బాధ్యతను అప్పగించగా అది తమ దేశానికే చెందిన ఎన్‌ఎన్‌సి-లావలిన్ కంపెనీకి ఇచ్చింది. 2003 నాటికి అది వెయ్యి పేజీల నివేదిక ఇచ్చింది. దాన్ని ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యంతో నిర్మించాలని సిఫార్సు చేసింది. సదరు ప్రాజెక్టును ఐరోపా దేశాలు దక్కించుకోవచ్చనే ఆందోళనను కూడా వెలిబుచ్చింది. అప్పటి లంక పరిస్ధితుల కారణంగా కెనడా ముందుకు రాలేదు. మహింద రాజపక్స సోదరుల ఏలుబడిలో 2005-15 మధ్య దానికి ఒక రూపు ఇచ్చారు. కెనడా కంపెనీ తరువాత డెన్మార్క్ కంపెనీ రామ్‌బోల్ 2006లో రెండవ సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందించింది. అది కూడా దాదాపుగా కెనడా కంపెనీ చెప్పిన అంశాలనే పేర్కొన్నది. దశలవారీ వృద్ధి చేయాలని చెప్పింది. ఏ నివేదిక కూడా ఆ రేవు నిర్మాణం గిట్టుబాటు కాదని చెప్పలేదు. రామ్‌బోల్ నివేదికను తీసుకొని లంక సర్కార్ అమెరికా, భారత్‌ల వద్దకు వెళ్లగా కుదరదని చెప్పిన తరువాతే దాని గురించి తెలుసుకొని చైనా కంపెనీ కంపెనీ రంగం లోకి దిగింది, కాంట్రాక్టును దక్కించుకుంది. జరిగింది ఇదైతే లంకను రుణ ఊబి లోకి దింపింది చైనా అని ఎలా చెబుతారు.
ఒప్పందం ప్రకారం మొదటి దశ మూడు సంవత్సరాల్లోనే పూర్తయింది. సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందించే సమయానికి ఉన్న పరిస్ధితులు మారిపోయాయి. మొదటి దశలో ఆశించిన రాబడి రాక ముందే 2012లో లంక సర్కార్ రెండవ దశను ముందుకు తెచ్చింది. దానికి గాను రెండు శాతం వడ్డీతో చైనా ఎగ్జిమ్ బ్యాంకు 75.7 కోట్ల డాలర్ల రుణం ఇచ్చింది. 2008లో ధనిక దేశాల్లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రపంచంలో వడ్డీ రేట్లు తగ్గాయి. తొలుత రేవు నిర్వహణ ప్రభుత్వ చేతుల్లోనే ఉంది. 2014లో అనుభవం ఉన్న కంపెనీతో కలసి ఉమ్మడిగా నిర్వహించాలని నిర్ణయించారు. చైనా మర్చంట్స్ గ్రూప్ కంపెనీ అప్పటికే కొలంబో రేవులో ఒక జట్టీ నిర్వహిస్తున్నది కనుక దానితోనే ఒప్పందం చేసుకున్నారు.
శ్రీలంక 2017లో చెల్లించాల్సిన 450 కోట్ల డాలర్ల విదేశీ రుణంలో హంబంటోటా రేవుకు తెచ్చిన మొత్తం కేవలం ఐదు శాతమే. ఆ ఏడాదే ఆ రేవును చైనా కంపెనీకి అప్పగించారు. అది చెల్లించిన 120 కోట్ల డాలర్లను విదేశీ చెల్లింపులకు సర్కార్ వినియోగించింది. అజాగళ స్థనం వంటిది అని చెబుతున్న రేవును తీసుకున్న చైనా కంపెనీ దాని లాభనష్టాలను భరించేందుకు సిద్ధపడినపుడు అది లంకకు ఉపశమనం కలిగించేదే కదా? సర్కార్ చేతులెత్తేసిన తరువాత చైనా కంపెనీ తీసుకుంది. దానిలో బలవంతం ఎక్కడీ
2012-18 మధ్య చైనా ఎగ్జిమ్ బ్యాంకు నుంచి తీసుకున్న 310 కోట్ల డాలర్ల రుణాలన్నీ రెండు శాతం వడ్డీ రేటువే. 2014లో చైనా డెవలప్‌మెంట్ బ్యాంకు నుంచి తీసుకున్న 40 కోట్ల డాలర్లకు మాత్రం మూడు నుంచి ఐదు శాతం వరకు ఉంది. ఇతరంగా విదేశాల నుంచి తీసుకున్న రుణాలన్నీ ఐదు శాతం కంటే ఎక్కువ రేటున్నవే. శ్రీలంకలో మన దేశం కూడా ఒక ప్రాజెక్టు నిర్మించింది. మెడెవాచచియా నుంచి మన్నార్ రైల్వే లైనుకు మన దేశం మూడు శాతం వడ్డీతో 16.4 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది. ఆ మార్గంలో తిరిగే రైల్లో రోజుకు రెండు వందల మంది కూడా ప్రయాణించటం లేదని, పెట్టుబడి వృధా అయిందనే విమర్శలు వచ్చాయి. ఏ ప్రాజక్టు నిర్మించినా దాని బాగోగులకు సంబంధించి అన్ని విషయాలూ ఆలోచించి, అక్కడి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి.