విరాళం అందజేస్తున్న జడ్‌పిటిసి విరుపాక్షి
ప్రజాశక్తి - చిప్పగిరి
హోళగుంద మండలం ముద్దటమ్యాగి గ్రామంలో శ్రీకృష్ణ దేవాలయ నిర్మాణానికి చిప్పగిరి జడ్‌పిటిసి విరుపాక్షి రూ.50 వేల విరాళం అందజేశారు. శ్రీకృష్ణ నూతన దేవాలయ నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో మంగళవారం ఆ గ్రామ యాదవ సంఘం పెద్దలు జడ్‌పిటిసి విరుపాక్షిని శ్రీకృష్ణ నూతన దేవాలయ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాలని కోరారు. వారి కోరిక మేరకు విరుపాక్షి స్పందిస్తూ రూ.50 వేల విరాళం అందజేశారు. చరిత్రలో నిలిచే దేవాలయ నిర్మాణాలకు తనవంతు సహాయం ఎప్పటికీ ఉంటుందని జడ్‌పిటిసి తెలిపారు. మున్ముందు కూడా తన సహాయ, సహకారాలు అందిస్తానని వారికి భరోసా ఇచ్చారు. వెంటనే స్పందించిన విరుపాక్షికి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. యాదవ సంఘం నాయకులు వెంకటేష్ పాల్గొన్నారు.










