Oct 09,2023 00:21

శ్రీకాళహస్తి ఆర్డీవో కేఎస్‌ రామారావు బదిలీ

శ్రీకాళహస్తి ఆర్డీవో కేఎస్‌ రామారావు బదిలీ
కనకదుర్గ ఆలయ ఈవోగా నియామకం
ప్రజాశక్తి- శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆర్డీవో కేఎస్‌ రామారావును బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖ నుంచి దేవదాయశాఖకు పంపుతూ విజయవాడ కనకదుర్గ ఆలయ కార్య నిర్వహణాధికారిగా నియమించింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. కేఎస్‌ రామారావు ఆర్డీవోగా చాలా మంచి పేరు తెచ్చుకుని ప్రజల మన్ననలు పొందారు. గతంలో ఈయనకు శ్రీశైలం భ్రమరాంబికా మల్లిఖార్జునస్వామి ఆలయ ఈవోగా పని చేసిన అనుభవం ఉంది.