Aug 05,2023 22:07

మాట్లాడుతున్న డిఎస్‌పి శృతి

ప్రజాశక్తి - శ్రీకాకుళం: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా శ్రీకాకుళం సబ్‌ డివిజన్‌ పరిధిలో ఈనెల రెండో తేదీ నుంచి సెప్టెంబరు ఒకటో తేదీ వరకు పోలీస్‌ యాక్ట్‌-30 అమల్లో ఉంటుందని డిఎస్‌పి వై.శృతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూనియన్లు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలకు పోలీస్‌ అధికారుల అనుమతులు తప్పనిసరి అని తెలిపారు. అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.