శ్రీహరికోటకు చేరిన ఆదిత్య- ఎల్1 ఉపగ్రహం
ప్రజాశక్తి- సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వచ్చే నెల మొదటి వారంలో ప్రయోగించనున్న ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం షార్ సెంటర్‌కు చేరుకుంది. బెంగుళూరులోని యుఆర్‌రావు సాటిలైట్ సెంటర్లో సిద్ధం చేసిన ఆదిత్య- ఎల్1 ఉపగ్రహాన్ని కట్టుదిట్టమైన బందోబస్తు నడుమ ప్రత్యేక కంటైనర్లో సోమవారం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట లోని షార్ సెంటర్‌కు తీసుకురావడం జరిగింది. ఈ ఉపగ్రహాన్ని పిఎస్‌ఎల్‌విసి57 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు.
మూడు రౌండ్లు తిరిగిన
చంద్రయాన్- 3 మిషన్...
16 వ తేదికి నాలుగో రౌండు పూర్తి...
శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుండి గత నెల 14 వ తేదీ ఇస్రో చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ చంద్రయాన్-3 మిషన్ ఇప్పుడు చంద్రుని చెంతకు చేరుకొని చందమామ చుట్టూ లూనార్ కక్షలో తిరుగుతూ ఉంది. చంద్రునికి చుట్టూ మూడవ రౌండు తిరగడం పూర్తి చేసింది. చంద్రునికి 150 కిలోమీటర్లు సమీప కక్షకు,177 కిలోమీటర్లు దూరపు కక్ష దగ్గరకు చేరుకుంది. ఇలా మరోమూడు సార్లు తిరిగిన తరువాత చంద్రుని పైకి ల్యాండ్ కావడం జరుగుతుంది. సోమవారం ఉదయం 11.50 గంటలకు చంద్రయాన్-3 మిషన్ చంద్రుని చుట్టూ తిరిగే మూడవ రౌండ్‌ను విజయవంతవంగా పూర్తి చేసింది. ఇక చంద్రుని కక్షలో నాలుగవ రౌండ్‌ను ప్రారంభించి ఈనెల 16 తేదీ ఉదయం 8.30గంటలకు పూర్తి చేయడం జరుగుతుంది.










