శ్రీగిరికి యాత్రికుల కాలినడక
ప్రజాశక్తి - ప్రత్యేక ప్రతినిధి కర్నూలు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం దారులంతా ఈవారం యాత్రికుల కాలినడక సందడి కనిపించింది. గత మూడేళ్ల నుంచి కరోనా కారణంగా తగ్గిన కాలినడక యాత్రికులు ఈ సారి పెరిగారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ,తదితర రాష్ట్రాల నుంచి యాత్రికులు భారీగా తరలివచ్చారు. ఆత్మకూరు మండలం వెంకటాపురం నుంచి శ్రీశైల క్షేత్రం వరకు దాదాపు 40 కిలోమీటర్లు భక్తులు కాలినడకన వెళ్లేవారితో ఈవారం రాత్రి పగలు శివన్నామస్మరణ వినిపించింది. వివిధ ప్రాంతాలనుంచి వెంకటాపురానికి, శ్రీశైలానికి ఎపిఎస్‌ఆర్‌టిసి, కెఎస్‌ఆర్‌టిసి స్పెషల్ బస్సులు నడిపింది. పలు స్వచ్చంద సంస్థలు యాత్రికులకు భోజన, అల్ఫాహార ఏర్పాట్లను చేశాయి. రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించారు. ప్రభుత్వం తరుపున కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ ఇబ్బందులు తప్పలేదు. కాలినడకన వెళ్లిన వారు తాగునీటి కోసం అనేక తంటాలు పడ్డారు. లక్షలాది జనం శ్రీశైలానికి చేరుకున్నారు. అంచనాలకు మించి జనం రావడంతో సౌకర్యాల కల్పనలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వచ్చాయి. నంద్యాల జిల్లాకు చెందిన కలెక్టర్ ఎస్‌పి, ఇతర ఉన్నతాధికారులు ఈవారమంతా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లతో నిమగమయ్యారు. మొత్తానికి శ్రీగిరి ఈవారం కిటకిటలాడింది. పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లను చేసింది.
పప్పుశనగ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు, రైతు సంఘాలు ఆందోళన చేశారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.5335 మద్దతు ధర ప్రకటించింది. దిగుబడులు వచ్చేనాటినికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడం, మద్దతు ధర ఇవ్వకపోవడంతో దాదాపు 80 శాతం మంది రైతులు క్వింటాలుకు రూ.4500 లకే ప్రయివేటు వ్యాపాలరుకు అమ్ముకున్నారు. ఆలస్యంగా ప్రభుత్వం స్పందించి అక్కడక్కడ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాము రైతులు కూడా అదేతరహాలో ఆందోళన చెందుతున్నారు. కర్ణాటకనుంచి కర్నూలు మార్కెట్‌కు వాము రావడంతో ధర పడిపోయిందని అంటున్నారు.
అప్పర్‌తుంగ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో జాతీయ హోదా ప్రకటించి నిర్మాణానికి రూ.5300 కోట్లు కేటాయించింది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో లబ్ధిపొందడానికి బిజెపి ప్రభుత్వం ఈ నిర్ణయం చేసిందని, రాయలసీమ జిల్లాలకు నష్టం కలిగించే నిర్ణయమని రాజకీయ పార్టీలు, రైతు, ప్రజాసంఘాలు నిరసన తెలిపాయి. కలెక్టరేట్ల వద్ద ధర్నాచేసి కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించారు. విశాఖపట్టణం ఒక్కటే అనే తరహాలో ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి ప్రకటనలు ప్రజలను ఆందోళను గురిచేసింది. సినీ నటుడు రామ్‌చరణ్ చిత్రషూటింగు బృందం కర్నూలులో కర్నూలులో పర్యటించింది. రామ్‌చరణ్ తదితర నటీనటులు సందడి చేశారు. సిపిఐ ఆధ్వర్యంలో పెండింగు ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమం నిర్వహించారు. దామోదరం సంజీవయ్య 162 వ జయంతిని జిల్లా ప్రజలు జరుపుకున్నారు. జడ్‌పి స్థాయి సంఘ సమావేశాలకు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. వైసిపి అధిస్టానం జరిపిన సర్వేలో కొందరుకి వచ్చే ఎన్నికల్లో టికెట్లు రావని అసంతృప్తితో ఉన్నారని కిందిస్థాయి క్యాడర్‌లో చర్చ జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ జీవితచరిత్రలోని విధ్వంసకర ఘట్టాలను బిబిసి రిలే చేసిందని ఆసంస్థపై కక్షగట్టి ఐటి దాడులు చేయించింది. స్వచ్చ భారత్ కార్మికుల జీతాలు చెల్లించాలని నిరసన తెలిపారు. ఉద్యోగుల జీతాలకు చట్టబద్దత కల్పించి ఆర్థిక భద్రతను చేకూర్చాలని సదస్సులు, సమావేశాలు, నిరసనలు తెలిపారు.
మీడియా స్వేచ్చపై జరిగిన దాడిని ఖండిస్తూ జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు నిరసన తెలిపారు. ఎపిడబ్ల్యుజెఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టు సంఘాలు కలెక్టరేట ఎదుట ధర్నాచేసి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నోటిపికేషన్‌ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. దీంతో అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. విద్యార్థి, ఉపాధ్యాయ, కార్మిక , యువజన , మహిళా తదితర సంఘాల ఆధ్వర్యంలో పిడిఎఫ్ అభ్యర్థులు పోతుల నాగరాజు, కత్తినరసింహారెడ్డి తరుపున విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆవును కౌగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు, హిందూ సంస్థలైన ఆర్‌ఎస్‌ఎస్ లాంటి సంస్థలే వ్యతిరేకించడంతో నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. టర్కీ, సిరియా భూకంప బాధితుల కోసం ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించారు.
eevaram Nandayala










