మదనపల్లె అర్బన్ : నిరుపేద కుటుంబాలకు విద్య, వైద్యం అందించడంలో పద్మభూషణ్, సత్సంగ్ ఫౌండర్ శ్రీఎం (ముంతాజ్ అలి) ఆదర్శనీయమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి అన్నారు. పట్టణంలోని నక్కలదిన్నెలో సంస్థ ఆధ్వర్యంలో 2021 ఫిబ్రవరిలో అప్పటి భారత రాష్ట్రపతి రామ్ నాథ్‌కోవింద్ శంకుస్థాపన చేసిన 50 పడకల మల్టీ స్పెషాలిటీ స్వస్త్య ఆసుపత్రిని నితిన్ గడ్కరి గురువారం ప్రారంభించారు. ముందుగా బిటీ కళాశాల మైదానానికి చేరుకున్న ఆయనకు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు, కలెక్టర్ గిరిష పిఎస్, మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాష, జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, మున్సిపల్ చైర్మన్ మనోజా రెడ్డి, జడ్పిటిసి ఉదరు కుమార్, మదనపల్లి ఆర్డీవో మురళి స్వాగతం పలికారు. అనంతరం సత్సంగ్ ఫౌండేషన్ వారి స్వస్త్య ఆస్పత్రి ప్రాంగణానికి చేరకుని ప్రారంభించారు. ఆస్పత్రిలోని విభాగాలను సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీ ఎం ఆధ్యాత్మిక వేత్త మాత్రమే కాకుండా సంఘసంస్కర్త అని చెప్పారు. నిరుపేద కుటుంబాలకు విద్య, వైద్యాన్ని అందిస్తున్నారని అన్నారు. కోవిడ్ - 19 సమయంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను దష్టిలో పెట్టుకొని మదనపల్లిలో ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని సంకల్పిం చారు. ఈ ఆసుపత్రిని ఇప్పుడే సందర్శి ంచానని, ఇందులో అన్ని రకాల సేవలు అందించడం అభినం దనీయమని కొనియాడారు. మదనపల్లె దగ్గర ఉన్న జాతీయ రహదారులపై ఏవైనా ప్రమాదాలు సంభవిస్తే వారికి అత్యవసర సేవలు అందించడానికి స్వస్త్య ఆసుపత్రి ఎంతో ఉపయో గకరంగా ఉంటుందని తెలియజేశారు. శ్రీ ఎం మాట్లాడుతూ మదనపల్లె పట్టణానికి తలమానికంగా, పేదలకు అందుబాటులో సత్సంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వాస్థ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. 24 ఆస్పత్రిలో వైద్యసేవలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి బిజెపి రాజంపేట పార్లమెంటు జిల్లా ప్రెసిడెంట్, ఎం.పార్థసారథి కదిరి మాజీ ఎమ్మెల్యే, ఏ.మంగరాజు బిజెపి అసెంబ్లీ కన్వీనర్ తంబళ్లపల్లె, నాగరెడ్డెమ్మ రాష్ట్ర బిజెపి ఇసి సభ్యులు కె.అంజనమ్మ రాష్ట్ర బిజెపి కౌన్సిల్ సభ్యులు కె. రవీంద్ర రాష్ట్ర గిరిజన మోర్చా సెక్రటరీ ఎం.వేణుగోపాల్ రాష్ట్ర ఓబిసి మోర్చా ఈసీ నెంబర్, శంకర్ మూర్తి బిజెపి టౌన్ ప్రెసిడెంట్, సత్సంగ్ ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు.










